పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని వాటికన్ తెలిపింది. పోప్‌ను యాంత్రిక వెంటిలేషన్‌లో చేర్చినట్లు పేర్కొంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఆయనను యాంత్రిక వెంటిలేషన్‌లో చేర్చినట్లు వాటికన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స పొందుతున్నారు. కానీ పోప్ ఆరోగ్య పరిస్థితి గురించి వాటికన్ మరిన్ని వివరాలను విడుదల చేయలేదని సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు దేవుడిని వేడుకుంటున్నారు.