కర్ణాటకలోని యల్లాపూర్ తాలూకాలోని చిమనల్లి గ్రామానికి చెందిన హాస్యనటుడు, ఖిలాడీ ఫేమ్ చంద్రశేఖర్ నాగప్ప సిద్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయన స్వస్థలం కట్టిగే గ్రామంలోని అడవిలో మృతదేహం వేలాడుతూ కనిపించింది. రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన సిద్ది సీరియల్స్‌లో నటించాడు. కానీ సినిమాల్లో అవకాశం రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.