అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ గాయత్రీ హజారికా(44) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె నెమ్‌కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె పాడిన 'గోరా పతే పతే ఫగున్ నమే' సాంగ్ అస్సామీస్ మ్యూజిక్ ఆంథమ్‌గా మారింది. ఎమోషనల్ పాటలు పాడటంలో గాయత్రీ దిట్ట. ఆమె మృతి పట్ల అస్సాం సీఎం హిమంత సహా పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భౌతికకాయాన్ని స్వాహిద్ న్యాస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు.