జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమే. అధిక జనాభా వల్ల అడవులు తగ్గిపోతున్నాయి, కాలుష్యం పెరుగుతోంది, నదుల ఆక్రమణలు ఎక్కువవుతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. ఆహార కొరత, నీటి కొరత, వ్యవసాయంలో రసాయనాల వాడకం పెరుగుతోంది. మానవ అవసరాల కోసం ప్రకృతిని అధికంగా వినియోగించడం వల్ల భూమికి నష్టం జరుగుతోంది. జనాభా నియంత్రణ లేకుంటే భవిష్యత్తులో వనరుల కొరత మరింత తీవ్రమవుతుంది.