నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు అయింది. కాగా, ఆయనను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించనున్నారు.