ప్రతి వ్యక్తి తమ భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటారు. రిస్క్ లేని పెట్టుబడుల కోసం పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.