బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ పథకాలకే అధిక వడ్డీ!

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లను యథాతథంగా ఉంచడంతో, బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల కోతపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని అందించే ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ పథకాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం 100% గ్యారంటీ ఇచ్చే ఈ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన (8.2% వడ్డీ)  సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (8.2% వడ్డీ) వంటివి బ్యాంకుల ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి ఇవి సరైన వేదిక.

సంబంధిత పోస్ట్