టెక్నో సంస్థ పోవా ఏఐ బడ్స్ ప్రోను భారత్‌లో విడుదల చేసింది. రూ.12,499 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏఐ రికార్డింగ్, మీటింగ్ సమ్మరీస్, 78 భాషల్లో లైవ్ ట్రాన్స్లేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు 22 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 8 మైక్రోఫోన్లు, 48dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ కనెక్టివిటీ, 40 గంటల బ్యాటరీ లైఫ్, వైర్లెస్ ఛార్జింగ్, IP55 రేటింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధరలో రూ.12,499కే లభిస్తున్నాయి.