మద్యం అమ్మితే కరెంట్ కట్, రేషన్ కార్డులు రద్దు

TG: జనగామ జిల్లా, చిల్పూర్ మండలం నష్కల్ గ్రామ సర్పంచ్ శాతబోయిన రాజు, గ్రామంలో బెల్ట్ షాపులను అరికట్టేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మకాలు జరుపుతున్న ఆరు షాపుల నిర్వాహకుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. భవిష్యత్తులో మద్యం అమ్మితే రేషన్ కార్డు, విద్యుత్, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు నిలిపివేస్తామని, బాండ్ పేపర్ రాసిస్తేనే కనెక్షన్లు పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్