పిల్లల భవిష్యత్తుకు పీపీఎఫ్.. 15 ఏళ్లలో రూ.35 లక్షలు!

పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక అద్భుతమైన పథకం. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు పిల్లల పేరు మీద ఖాతా తెరవవచ్చు. అధీకృత బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో కనీసం రూ.100తో ఖాతా తెరిచి, వార్షికంగా రూ.500 జమచేస్తే చాలు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు, ప్రస్తుతం 7.1% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు, 3 ఏళ్ల చిన్నారి పేరు మీద నెలకు రూ.10,882 చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే, 18 ఏళ్లు వచ్చేసరికి రూ.35 లక్షల వరకు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

సంబంధిత పోస్ట్