దాదాపు ఏడేళ్ల తర్వాత, 'బాహుబలి' ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ డీపీగా ఉంచిన ప్రభాస్.. తన కొత్త చిత్రం 'ఫౌజీ' పోస్టర్ను కొత్త డీపీగా పెట్టారు. 'సలార్', 'కల్కి' చిత్రాలకు కూడా డీపీని మార్చని ఆయన, ఈ సినిమాకు మార్చడంతో, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది.