ప్రభాస్‌ 'ఫౌజీ'.. ప్రీక్వెల్‌ ఫిక్స్‌

దర్శకుడు హను రాఘవపూడి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'ఫౌజీ' అనే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రెండో భాగం సీక్వెల్ కాకుండా, అసలు కథకు ముందు జరిగిన సంఘటనలను తెలిపే ప్రీక్వెల్‌గా రానుంది. వలస పాలన కాలం నాటి తెలియని కథలను, ప్రేమకావ్యాలను వెలికితీయడమే ఈ ప్రయోగం వెనుక కారణమని దర్శకుడు తెలిపారు. 'సీతారామం' తరహాలోనే, ఈ ఎపిక్ పీరియడ్ డ్రామా ఒక సైనికుడి ధైర్యసాహసాల కథను చెబుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత పోస్ట్