రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్', 'ఫౌజీ' చిత్రాల షూటింగ్ వేగంగా జరుగుతోంది. 'స్పిరిట్' సినిమాకు సంబంధించి 60-70% షూటింగ్ పూర్తయింది. ఒక పాట షూటింగ్ మంగళవారంతో ముగియనుంది. ఆ తర్వాత కూకట్‌పల్లిలో మరో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చాక 'స్పిరిట్' షూటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రెండు నెలలు 'ఫౌజీ' సినిమా కోసం కేటాయించనున్నారు. కాగా, 'స్పిరిట్' వచ్చే ఏడాది మార్చి 5న విడుదలయ్యే అవకాశం ఉంది.