తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక అలర్ట్ జారీ చేసింది. ఇకపై ఇంటర్ ఫస్టియర్‌లోనూ తప్పనిసరిగా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు అధికారికంగా సర్క్యులర్ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షలకు గంటన్నర సమయం కేటాయించనున్నారు. మరో 15 మార్కులు సెకండియర్‌లో ఉంటాయి. ఈ మార్పుల కారణంగా ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల థియరీ పరీక్షలకు 60 మార్కులు కేటాయించారు.