TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఏ1గా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. అయితే కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందనే నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించారు.