బిహార్‌ ఉప ఎన్నికల బరిలో ప్రశాంత్‌ కిషోర్‌

జన్ సూరజ్ పార్టీ చీఫ్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిహార్‌ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. బంకీపూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాజ్యసభకు వెళ్లడంతో బంకీపూర్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. బంకీపూర్‌ సహా మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ నుంచి పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. ఇక ఆ ఎన్నికల్లో పీకే పోటీ చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్