నేటికాలంలో చిన్నవయసులోనే ప్రీ-డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య అధికమవుతోంది. ప్రీ-డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. కానీ మధుమేహం ఉన్నట్లు నిర్ధారించేంత ఎక్కువగా ఉండవు. ఇది మధుమేహానికి ముందు వచ్చే దశ. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణతో ప్రీ-డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.