ప్రీ-డయాబెటిస్‌లో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు, కానీ కొందరిలో అలసట, అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన ఉండవచ్చు. రక్త పరీక్షల ద్వారానే ప్రీ-డయాబెటిస్‌ను గుర్తించవచ్చు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. డయాబెటీస్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, 45 ఏళ్లు పైబడినవారు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలి.