భర్త, అత్తామామ వేధింపులు తాళలేక ఓ గర్భిణి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫసీలా, నౌఫాల్ భార్యభర్తలు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే అత్తింటివారు తనని వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లికి మేసేజ్‌లు పంపింది. తాను రెండోసారి గర్భవతినని, తన భర్త కడుపుపై తన్నుతున్నాడని అందులో పేర్కొంది. అత్తింటివారు తనని చంపేసేలా ఉన్నారని, అందుకే తానే ఉరి వేసుకుని చనిపోతున్నట్లు తెలిపింది.