రెప్పపాటులో పోలీసు బస్సు ఢీ.. గర్భిణీ మృతి (వీడియో)

యూపీలోని కన్నౌజ్‌లో రెప్పపాటులో విషాద ఘటన జరిగింది. ఓ పోలీసు బస్సు రోడ్డుపై వేగంగా వెళ్తూ అదుపు తప్పింది. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. చివరికి ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. అప్పటికే ఆ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టగా, గర్భిణీ కింద పడి చనిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్