రోడ్డు ప్రమాదంలో శిశువుతో సహా గర్భిణి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందింది. మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు కిందపడిపోయారు. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడు నెలల శిశువు ఆమె కడుపులో నుంచి బయట పడి రోడ్డుపై పడింది.