గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆహారాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచించారు. ముఖ్యంగా, అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, అధిక ఉప్పు ఉన్న పదార్థాలు, సరిగ్గా ఉడకని మాంసం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, చీజ్, చక్కెర పానీయాలు, అధిక కెఫిన్, మద్యం, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి గర్భిణులకు హానికరం అని నిపుణులు తెలిపారు. ఈ ఆహారాలు తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు.