చాహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా.. వీడియో వైరల్

IPLలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని సాధించింది. ఓటమి తప్పదనుకున్న స్థితిలో అద్భుతంగా పోరాడి విజయం అందుకుంది. ఇందులో స్పిన్నర్ చాహల్ కీలక పాత్ర పోషించగా, జట్టు యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో ఉత్సాహంగా గంతులు వేశారు. చివరికి చాహల్‌ను హత్తుకుని అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్