ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’. థ్రిల్ ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను హీరో నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రేమ, హాస్యం, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.