ఎల్‌ఐసీలో రూ.10వేల కోట్ల వాటా విక్రయానికి సన్నాహాలు

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో దాదాపు 2 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వాటా విక్రయం ద్వారా సుమారు రూ.10వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాయి. సంస్థాగత మదుపర్లకు ఈ వాటాలు విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ జూన్‌ చివర్లో లేదా జులై ప్రారంభంలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్