రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్య సభకు నలుగురు సభ్యులను నామినేట్ చేశారు. హై ప్రొఫైల్ క్రిమినల్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి.సదానందన్ మాస్టర్, విదేశాంగ మాజీ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్‌ను నామినేట్ చేశారు. రాజ్యసభలో త్వరలో ఖాళీ అయ్యే స్థానాల్లో వీరిని భర్తీ చేయనున్నారు.