పత్తి పంటను ఆశించే తెల్ల ఈగలు మొక్కల నుండి రసాన్ని పీల్చి, నల్లటి బూజు ఏర్పడేలా చేసి పంటను దెబ్బతీస్తాయి. వీటి నివారణకు పసుపు అట్టలను ఎకరాకు 8-10 చొప్పున అమర్చాలి. పొలంలో, గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నత్రజని ఎరువుల వాడకాన్ని పరిమితం చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ అధికారుల సలహాతో రసాయన మందులను ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.