మొన్న డాగ్‌ బాబు.. ఇప్పుడు డాగేశ్‌

బిహార్‌లో ఇటీవల ఓ శునకానికి ‘డాగ్‌ బాబు’ అనే పేరుతో అధికారులు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిహార్‌లోని నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి ‘డాగేశ్‌ బాబు’ అనే పేరున్న మరో కుక్క ఫొటోతో నివాసపత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై నవాడా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్