రూ.100కు చేరిన సన్న బియ్యం ధర

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు పేద, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్లో సోనా మసూరి, బీపీటీ వంటి బియ్యం రకాలు కిలో రూ. 75 నుంచి రూ. 90 వరకు విక్రయిస్తుండగా, నాణ్యమైన పాత బియ్యం ధర ఏకంగా రూ. 100కు చేరువలో ఉంది. గతేడాది రూ. 50-60 మధ్య ఉన్న ధరలు ఇప్పుడు అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి నెలకు 25-30 కిలోల బియ్యం అవసరం కావడంతో, ఈ ధరల పెరుగుదల గృహిణులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕