ఈక్వెడార్లోని ఒక చర్చిలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. క్యాథలిక్ పాస్టర్ పాట్రిసియో ప్రార్థనలు నిర్వహిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా, వెనుక వైపు ఉన్న భారీ చెక్క సిలువ అకస్మాత్తుగా ఆయనపై పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఫాదర్ అక్కడికక్కడే మరణించారు. అక్కడున్న సిబ్బంది ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.