ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాక, 2.30 గంటలకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం హైటెక్ సిటీకి వెళ్లి, మధ్యాహ్నం 3.45 నుండి 4.15 వరకు సింధు హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని, 6.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 6.45 గంటలకు జామనగర్‌కు బయలుదేరతారు.