భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పుణె పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం మోదీ పుణె చేరుకోవాల్సి ఉంది. రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. వర్షాల రాకను పక్కాగా చెప్పే రెండు సూపర్ కంప్యూటర్లను కూడా ప్రారంభించాల్సింది. అయితే, భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తడంతో ఈ పర్యటన రద్దయింది.