ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (శనివారం) వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే సభలో ప్రధాని మోదీ పాల్గొని పీఎం కిసాన్ పథకం 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు 20,500 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు జమకానున్నాయి.