అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఉన్న టీ తోటలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులను ఆయన కలుసుకుని వారితో ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కార్మికుల కృషిని అభినందించారు.