వచ్చే నెలలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ!

చైనాలో జరిగే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు తాజాగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన తర్వాత మోదీ చైనా వెళ్లలేదు. అయితే తాజాగా భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతుండటంతో, మోదీ చైనాలో పర్యటించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్