ప్రధాని మోదీ బుధవారం వారణాసిని దర్శించుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం వారణాసి చేరుకున్న ప్రధాని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. స్థానిక అభివృద్ధి పనులకు వేగం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.