యూపీలోని ముజఫర్‌నగర్‌లోని DAV అనే ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణ ఘటన జరిగింది. బీఏ రెండవ సంవత్సరం చదువుతున్న ఉజ్వల్ రాణా అనే విద్యార్థి తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రూ. 7,000 ఫీజు బకాయి ఉండటంతో, ప్రిన్సిపాల్ ప్రదీప్ సింగ్ తనను కొట్టి, అవమానించారని ఉజ్వల్ ఆరోపించాడు. దీనిపై అతను ఒక వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉజ్వల్‌ను చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.