TG: 10+2 కొత్త విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 12వ తరగతి స్థాయి నుంచే స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతికత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను ఆధునీకరించాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం.