బెంగళూరు సెంట్రల్ జైలులో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు మందు పార్టీ నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యారెక్‌లో ప్లాస్టిక్ గ్లాసుల్లో మందు, పండ్లు, పల్లీలు ఏర్పాటు చేసుకుని పాటలు, డ్యాన్సులతో ఖైదీలు ఎంజాయ్ చేశారు. ఉమేష్ రెడ్డి, తరుణ్ రాజు వంటి ఖైదీలు ఫోన్లు వాడుతూ వీవీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్టు వీడియోలు బయటపడ్డాయి. ఈ ఘటనపై సీఎం సీరియస్ అవడంతో, జైలు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.