ఏపీలో లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్