TG: బడి అంటే కులం, మతం, జాతి లాంటి వాటితో సంబంధం లేకుండా చదువుకునే దేవాలయం. అలాంటి స్కూల్‌లో మత బోధనలు జరిగితే..?. వరంగల్ జిల్లా వర్థన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అదే జరిగింది. పాఠాలు చెప్పే సమయంలో తరగతి గదిలో మత బోధన చేశారు. 1వ తరగతి విద్యార్థులకు చర్చి ఫాదర్‌తో మత ప్రార్థనలు చేయించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.