AP: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణికులలో సుమారు 13 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.