ప్రియాంక చోప్రా దసరా సంబరాలు

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా విజయదశమి వేడుకలను లాస్‌ ఏంజెలెస్‌లోని తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. తన భర్త నిక్‌ జోనాస్‌, కుమార్తె మాలతీ మేరీ చోప్రా జోనాస్‌లతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'జై మాతా దీ' అని ఉన్న కండువా ధరించిన తన కుమార్తె ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకోగా, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిక్‌ జోనాస్‌ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తారని, ఇది తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕