త్రుటిలో ప్రపంచ రికార్డు మిస్ చేసుకున్న ప్రియాంశ్ ఆర్య (వీడియో)

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య చరిత్ర సృష్టించాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లో 181 పరుగులు బాదాడు. ఇందులో 19 సిక్సర్లు, భారీ బౌండరీలు ఉన్నాయి. దీంతో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టీ20 రికార్డు 188 పరుగులకు కేవలం 7 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌తో దిల్లీ 275/5 భారీ స్కోరు సాధించింది. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును ఫిన్ అలెన్‌తో కలిసి ప్రియాంశ్ పంచుకున్నాడు.
Video Credit: BCCI Domestic

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕