కాపర్ లో పెట్టుబడి.. బంగారం, వెండిని మించి లాభాలు!

గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టాయి. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు, 2035 నాటికి తులం బంగారం రూ.3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, బంగారం, వెండితో పాటు కాపర్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. గత ఐదేళ్లలో కాపర్ ధర 113% పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ డేటా సెంటర్లలో కాపర్ వాడకం పెరుగుతున్నందున భవిష్యత్తులో దీనికి డిమాండ్ భారీగా ఉంటుందని అంచనా. కాపర్ ఈటీఎఫ్‌లు, కాపర్ మైన్స్ ఈటీఎఫ్‌లు, యూఎస్ కాపర్ ఈటీఎఫ్‌ల ద్వారా భారతీయులు కాపర్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్