రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసులో భూ వివాదమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. స్వప్న అన్న రాజు, తల్లి వెంకటమ్మ పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి ప్రయత్నించగా.. స్వప్న అడ్డుకోవడంతో పొలం వద్ద సర్వే చేయిస్తున్న సమయంలో రాజు ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వప్న మృతి చెందింది. ఈ హత్యలో రాజుకు కావలి శివలింగం, వడ్డే వీరేశ్, ఎర్రోళ్ల సందీప్ సహకరించినట్లు సమాచారం. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.