AP: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, AA ఆర్ట్స్ అధినేత కే మహేంద్ర (75) కన్నుమూశారు. రాత్రి 12 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. నేడు గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.