ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త అందించారు. సచివాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. అంతేకాకుండా, సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని, ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు.