AP: గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. బంధువుల మధ్య తలెత్తిన వివాదంలో సుబ్బయ్య అనే వ్యక్తి కొడూరు శ్రీనివాసరావుపై యాసిడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మార్చి 27న జరగ్గ, స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.