ఐపీఓతో రూ.244.65 కోట్లు సమీకరణకు సిద్ధమైన ప్రాప్షేర్ సెలెసియా

ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్​మెంట్​ ట్రస్ట్​కు చెందిన ప్రాప్​షేర్​ సెలెసియా ఐపీఓ వచ్చే నెల 10–16 తేదీల్లో జరగనుంది. దీని ద్వారా కంపెనీ రూ.244.65 కోట్లను సమీకరిస్తుంది. ఒక్కో యూనిట్​ ధర రూ.10 లక్షల నుంచి రూ.10.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ నిధులతో అహ్మదాబాద్​లోని వీనస్​ స్ట్రాటమ్​ భవనంలో ఏడు అంతస్తులను కొనుగోలు చేస్తారు. కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. యూనిట్లను బీఎస్​ఈలో లిస్ట్​ చేయనున్నారు. ఇది దేశంలోనే మొదటి రిజిస్టర్డ్​ ఎస్​ఎం రీట్​గా నిలవనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్